అనంతగిరి: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ –12ను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు ఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. శనివారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆపరేషన్ ముస్కాన్‌పై సబ్ డివిజన్ బృందాలు, సంబంధిత శాఖల అధికారులు, భాగస్వామ్య విభాగాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇది వరకు చేపట్టిన కేసులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీసీపీయూ ఇన్‌చార్జ్ కాంతారావు, కార్యక్రమ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అన్వర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ రాజేశ్ మీనా


