దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోండి

Jul 26 2026 8:00 AM | Updated on Jul 26 2026 8:00 AM

దుద్యాల్‌: మండలంలోని చిలుముల్‌ మైల్వర్‌ గ్రామంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రాఘవేందర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ఎస్సీ –1, ఎస్టీ –1, 7వ తరగతిలో ఎస్సీ –1, బీసీ –1, 8వ తరగతిలో బీసీ –1, 9వ తరగతిలో ఎస్సీ –1, ఓసీ ఒక సీటు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు, ఫొటో, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్ల తెలిపారు. ఇతర వివరాలకు సెల్‌ నంబర్‌ 9676927579, 9493449755, 9949764208లలో సంప్రదించాలన్నారు.

రైతు ఆత్మహత్య

బంట్వారం: ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం కోట్‌పల్లి మండల పరిధిలోని రాంపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శైలజ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మదారం కృష్ణ (35) వ్యవసాయం చేస్తుంటాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో శనివారం ఉదయం పత్తి చేనుకు పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అప్పటికే మద్యం తాగిన కృష్ణ అదే మత్తులో పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కృష్ణ భార్య గంగోత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement