తాండూరు పట్టణం నగరేశ్వర ఆలయంలో కొలువుదీరిన వాసవి మాత శుక్రవారం శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం ప్రారంభం కావడంతో వాసవీ మహిళా సంఘం సభ్యులు తీరొక్క కూరగాయలతో అమ్మవారిని అలంకరించి బోనాలు సమర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ అమ్మవారిని దర్శించుకున్నారు. మహా కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలో సంఘం అధ్యక్షురాలు ప్రగతి, కార్యదర్శి కవిత, కోశాధికారి పల్లవి, ఆలయ చైర్మన్ సతీష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళి, కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. – తాండూరు టౌన్


