మోమిన్‌పేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆదేశించారు. శుక్రవారం మోమిన్‌పేటలో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకోవాలని బీఎల్‌ఓలకు సూచించారు. ఎవరైతే ఫారాలు ఇవ్వరో వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు చెప్పారు. ఒకరికి ఒకే ఓటు ఉండాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో సర్ ప్రక్రియ 90శాతం పూర్తి కావచ్చిందన్నారు. తప్పులు లేకుండా ఫారాలు నింపాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునిరొద్దీన్, ఎంపీఓ సంజయ్‌కుమార్, ఆర్‌ఐ గోవర్ధన్, కార్యదర్శి మల్లేశం గౌడ్, బీఎల్‌ఓలు, నాయకుడు శుభాష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలి
జిల్లా పంచాయతీ అధికారి జయసుధ


