పరిగి: ఎల్‌నినో పరిస్థితుల కారణంగా వర్షాలు చాలా తక్కువ కురిసే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్‌రెడ్డి, పరిగి ఏడీఏ అరుణ సూచించారు. శుక్రవారం పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని రైతులకు ఎల్‌నినో ప్రభావం, పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. వరి, ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ రచిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్‌రెడ్డి


