అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధి శివారెడ్డిపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను బుధవారం డీఈఓ అబ్దుల్ ఘని సందర్శించారు. శిక్షణలో అన్ని అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఈ విషయాలను పాఠశాలల్లో బోధించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం చదవి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. పాఠశాలలోని పూల మొక్కలు, కిచెన్ గార్డెన్‌ను సందర్శించి ప్రిన్సిపాల్ నజీమున్సీసా, జహంగీర్‌ను అభినందించారు. కార్యక్రమంలో పీడీ ప్రతాప్‌రెడ్డి, సీఆర్‌పీ రవి, శిక్షణ డైరక్టర్ గోపాల్, ఆర్‌సీలు మల్లేశం, యాదయ్య, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ అంశాలను విద్యార్థులకు నేర్పండి
ధారూరు: శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రామ్‌మస్త సూచించారు. మండలంలోని కేరెళ్లి ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ వృత్తాంతర మొదటి విడత ఇంటిగ్రేటెడ్ సర్వీస్ టీచర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో తెలుసుకున్న కొత్త విషాలను విద్యార్థులకు నేర్పించాలని తెలిపారు. విద్యారంగంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చెన్నయ్య, రిసోర్స్ పర్సన్లు నిజామొద్దీన్, అంజయ్య, శ్రీనివాస్, రఘు, అశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధారూరు: మాట్లాడుతున్న డీఏఎంఓ రామ్‌మస్త
అనంతగిరి: మాట్లాడుతున్న డీఈఓ అబ్దుల్ ఘని


