యాలాల: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ధర్నాకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ పీఎం మోదీ, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ అధ్యక్షుడు భీమప్ప, గాజుల మన్నాన్, సర్పంచ్‌లు అమర్‌నాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్, శ్రీవాణి, నరేష్‌కుమార్, సీనియర్ నాయకులు హన్మంతు, అమృతయ్య, పెద్దపులి ఖాసీం, సత్యనారాయణరెడ్డి, జనార్దన్‌రెడ్డి, కై లా రాఘవేందర్‌రెడ్డి, రాచూరి రాజు, ఆరీఫ్ హుస్సేన్, పంతుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


