‘సర్‌’కు నాయకుల సహకారం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’కు నాయకుల సహకారం తప్పనిసరి

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

● ఆర్‌డీఓ వాసుచంద్ర

పరిగి: సర్‌ ప్రక్రియకు ఆయా పార్టీల నాయకులు సహకరించాలని ఆర్‌డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీ నాటికి వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారికి సమాచారం అందించి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇచ్చేలా నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్‌ పత్రాలు తిరిగి ఇవ్వకుంటే ఓటు హక్కు కోల్పోతారని స్పష్టం చేశారు. ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్వరి, డీటీలు అనిల్‌బాబు, విజయేందర్‌, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement