మారుమూల తండాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ సేవలు లేకపోవడం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శాపంగా మారింది. గత్యంతరం లేక కాలినడకన బడికి వెళ్లాల్సి వస్తుందని చిన్నారులు వాపోతున్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు మాత్రం ఎంచక్కా స్కూల్ బస్సులో వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వ పెద్దలు రవాణా సదుపాయంపై దృష్టి సారించాలి. బొంరాస్‌పేట మండలంలో అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేడుకొంటున్నారు. – బొంరాస్‌పేట


