ప్రణాళికతో పనులు చేపట్టాలి
ఎంపీడీఓ శ్రీనిజ
యాలాల: గ్రామాల్లో అభివృద్ధిని ప్రణాళిక(జీపీడీపీ)తో చేపట్టేలా పాలకమండలి సభ్యులకు సూచించాలని ఎంపీడీఓ శ్రీనిజ అన్నారు. బుధవారం మండల పరిషత్ సమావేశ హాలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యయం తెలిపేలా వారికి చెప్పాలన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని, ఆదాయం, వ్యయ నివేదిక, పన్ను వసూలు, భవన అనుమతులు, వ్యాపార లైసెన్సులు, పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వన నర్సరీలు, ప్లాంటేషన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జాబ్ కార్డుల పంపిణీ, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనుల గురించి సమీక్షించారు. ఎంపీఓ ఆనంద్‌కుమార్, ఏపీఓ జనార్దన్, ఈసీ శ్రావణ్‌కుమార్, టీఏ, ఎఫ్‌ఏ తదితరులు ఉన్నారు.


