మాటతప్పం.. హామీలు నెరవేరుస్తాం
● తొలుత తాగునీటి సమస్యపై దృష్టి
● అనంతరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం: సర్పంచులు
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. మాట తప్పకుండా విడతల వారీగా అమలు చేసాం’ అని సర్పంచులు అన్నారు. బుధవారం నూతన పాలకవర్గ సభ్యులు వారివారి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
అనంతగిరి: గ్రామస్తుల సహకారంతో ఊరును అభివృద్ధి చేస్తానని బురాన్‌పల్లి సర్పంచ్ రాందాస్ నాయక్ అన్నారు. గ్రామంలో బోర్‌కు కొత్త మోటారు బిగించడంతో పాటు పలు చోట్ల విద్యుత్ దీపాలను అమర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత తాగునీటి సమస్య తీర్చానని చెప్పారు. క్రమంగా విద్యుత్ దీపాలు, శానిటేషన్‌పై దృష్టి సారిస్తాని తెలిపారు. రానున్న ఐదేళ్లలో హామీలన్ని నెరవేర్చుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అభిషేక్ తివారీ, కార్యదర్శి స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బోర్లకు మరమ్మతు
ధారూరు: మరమ్మతులకు గురైన బోర్లను పీసీఎంతండా సర్పంచ్ బాలునాయక్ వినియోగంలోకి తెచ్చారు. బుధవారం మూడు బోర్లకు మరమ్మతు చేయించి, నీటి సమస్య తీర్చానని ఆయన తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
పిచ్చిమొక్కల తొలగింపు
కుల్కచర్ల: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయరాదని కుస్మసముద్రం సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గ్రామశివారులో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను బుధవారం తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తామన్నారు. గ్రామాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు మొక్కలను విరివిగా పెంచడంతో పాటు, మురుగుకాల్వలు శుభ్రంగా ఉండేలా చూస్తామని చెప్పారు. లక్ష్మయ్య, మల్లేశ్ ఉన్నారు.
మాటతప్పం.. హామీలు నెరవేరుస్తాం


