గిరిజన తండాల అభివృద్ధికి కృషి
డీసీసీ ఉపాధ్యక్షుడు బీంరెడ్డి
కుల్కచర్ల: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు బీంరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధి దీప్లానాయక్‌తండాలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తండాకు మొదటి సర్పంచిగా ఎన్నికై న అంజలి చరిత్రలో నిలిచిపోనున్నారని పేర్కొన్నారు. తండాల అభివృద్ధికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అనంతరం అంజలితో ప్రత్యేకపూజలు, చేయించి, సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, నాయకులు రవి, భరత్, దేవుజానాయక్, సువ్వాలిబాయి, రవీందర్, శ్రీనివాస్, భరత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


