అంగన్‌వాడీ టీచర్లకు అండగా ఉంటాం
బషీరాబాద్: అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసి, టీచర్ల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎప్పటికప్పుడు ఎండగడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. కర్షక, కార్మికుల పట్ల చేపట్టే వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను కాపాడుకోవడానికి టీచర్లతో కలసి పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయనను అంగన్‌వాడీ టీచర్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రతకల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనికాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పెరిగిన నిత్యావసరా సరకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై న బాలమణిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీచర్లు రామానుజమ్మ, వాణి, శశికళ, శోభ వసంత, రమ పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్


