ఓటరు జాబితా ప్రదర్శన
వార్డుల వారీగా ఓటర్లు
● అభ్యంతరాలుంటే తెలియజేయండి
● 10న ఓటరు తుది జాబితా
● మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య
పరిగి: మున్సిపల్ ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కమిషనర్ వెంకటయ్య సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో 18 వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో, గ్రంథాలయ ఆవరణలో ఓటరు జాబితాను ఉంచినట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు లిఖిత పూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరారు. ఓటరు పేరు, వార్డు సక్రమంగా ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. అఽభ్యంతరాలను పరిశీలించి 10వ తేదీ ఓటరు తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
వార్డులు సీ్త్రలు పురుషులు మొత్తం
1వ వార్డు 623 648 1,271
2వ వార్డు 403 430 833
3వ వార్డు 496 498 994
4వ వార్డు 404 432 836
5వ వార్డు 433 433 866
6వ వార్డు 502 551 1,053
7వ వార్డు 657 680 1,337
8వ వార్డు 441 528 969
9వ వార్డు 452 469 921
10వ వార్డు 369 396 765
11వ వార్డు 484 506 990
12వ వార్డు 397 436 833
5,661 6,007 11,668


