రోడ్డు భద్రత మాసోత్సవాలను..
విజయవంతం చేద్దాం
● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రవాణా శాఖ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, జిల్లా రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ
జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


