కొత్త ఆశలతో..
కుల్కచర్ల: పాంబండ రామలింగేశ్వరుడి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా గురువారం నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే యువత సంబరాల్లో మునిగిపోయారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు.. 2026కు ఘనంగా స్వాగతం పలికారు. వీధుల్లోకి చేరి కేరింతలు కొడుతూ కనిపించిన ప్రతి ఒక్కరికీ న్యూ ఇయర్ విషెష్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయా విభాగాల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రతీక్‌జైన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
ఎస్పీ స్నేహ మెహ్ర తన కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. కేక్ కట్ న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
భక్తుల తాకిడి
వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరి గుట్టకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంత పద్మనాభుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో ఉన్నారు. కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలని వేడుకున్నారు. అనంతరం కుటుంబీకులు, స్నేహితులతో కలిసి సమీప అడవిలో సాయంత్రం వరకు సరదాగా గడిపారు.
అనంతపద్మనాభ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు
సిబ్బందితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
అనంతగిరి: ఆలయం వద్ద భక్తుల కోలాహలం
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు ఒడ్డున పర్యాటకుల సందడి
బోటింగ్ చేస్తున్న యువతీయువకులు
నూతన సంవత్సరంలోకి అడుగులు
2025కు వీడ్కోలు
2026కి ఘనంగా స్వాగతం
సంబురాల్లో మునిగితేలిన యువత
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కొత్త ఆశలతో..
కొత్త ఆశలతో..
కొత్త ఆశలతో..
కొత్త ఆశలతో..
కొత్త ఆశలతో..
కొత్త ఆశలతో..


