మొరాయించిన టిమ్.. వెనక్కి మళ్లిన బస్!
ధారూరు: టిమ్ (టికెట్ ఇష్యూఇంగ్ మిషన్) మొరాయించడంతో ఆర్టీసీకి చెందిన ఓ ఎక్స్‌ప్రెస్ బస్సు మధ్యనుంచే వెనక్కి వెళ్లిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు డిపోకు చెందిన టీజీ 34 జెడ్ 0023 నంబర్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ బయల్దేరింది. ఈక్రమంలో మంబాపూర్ దాటే వరకూ టికెట్లు ఇచ్చే మిషన్ బాగానే పనిచేసింది. ఉదయం 10గంటలకు ధారూరుకు చేరుకోగా, ఇక్కడ ఎక్కిన ప్రయాణికులకు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎంతకీ రాలేదు. దీంతో కండక్టర్ డిపో మేనేజర్‌కు ఫోన్ చేశారు. ఆయన సూచన మేరకు ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి, బస్సును ఖాళీగా వెనక్కి తీసుకెళ్లారు.
మొరాయించిన టిమ్.. వెనక్కి మళ్లిన బస్!


