రోహిత్‌రెడ్డి తాండూరుకు చేసిందేమీ లేదు
● అభివృద్ధి పేరిట ప్రజలను మఽభ్య పెట్టారు
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● లబ్ధిదారులకుసీఎం సహాయ నిధి చెక్కుల అందజేత
తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తాండూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 88 మందికి రూ.39.56 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టడం, సెటిల్‌మెంట్లు చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. అభివృద్ధి పేరిట ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా కోట్‌పల్లి ప్రాజెక్టును అభివృద్ధి చేయలేకపోయారన్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.100 కోటు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని ఆధారాలతో చూపించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు నర్సింహులు, ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణ తరగతులు
తాండూరు టౌన్: పీపుల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఎస్ కంప్యూటర్ సెంటర్‌లో నిర్వహిస్తున్న సోలార్ టెక్నీషియన్ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని, కావున టెక్నీషియన్లు అవసరమవుతారన్నారు. కంప్యూటర్‌లో శిక్షణ, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా నేర్పిస్తారన్నారు. అనంతరం ఏఎస్ కంప్యూటర్స్ ప్రతినిధి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. ఈ శిక్షణకు 18 నుంచి 35 ఏళ్ల వయసు లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ స్వప్న, పీపుల్ ట్రీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంపత్‌కుమార్, సౌత్ ఇండియన్ హెడ్ సురేష్ రెడ్డి, ఏఎస్ కంప్యూటర్స్ డైరెక్టర్ అన్నపూర్ణ, కాంగ్రెస్ నాయకులు హబీబ్‌లాలా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


