ఇన్‌స్ట్రక్టర్ నియామకంపై ఫిర్యాదు
బషీరాబాద్: ప్రీ ప్రైమరీ నూతన విద్యావిధానంలో కొత్తగా నియమిస్తున్న ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని నావంద్గీ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ బుధవారం డీఈఓ రేణుకాదేవికి విన్నవించారు. ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగం కోసం గ్రామానికి చెందిన అభ్యర్థులు సంగీత, పింకీ, లక్షి, గౌరి దరఖాస్తు చేసుకున్నారని, వీరెవరికీ కాకుండా హెచ్‌ఎం మధు మద్దతుతో బషీరాబాద్‌కు చెందిన ఆర్.లక్ష్మి అనే అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. బషీరాబాద్‌కు చెందిన సదరు అభ్యర్థి నావంద్గీ గ్రామ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ పెట్టారని, ఆమె నియామకాన్ని రద్దు చేసి, స్థానికుల్లో అర్హులైన అభ్యర్థిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రామక్రిష్ణగౌడ్, రంగారెడ్డి, రాజేందర్‌రెడ్డి, కొండారెడ్డి, రమేశ్ ఉన్నారు.


