ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
దోమ: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాజేశ్వరి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని దిర్సంపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని డీఎస్‌ఓ సుదర్శన్‌తో కలిసి ఆమె సందర్శించి ధాన్యం తేమను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైన రైతులకు గొనే సంచులు ఇచ్చి అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. తేమ శాతం సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతుల ధాన్యాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేసి వెంటనే బిల్లులు వేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాజేశ్వరి


