ఆదర్శంగా ‘ల్యాబ్‌’ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శంగా ‘ల్యాబ్‌’ అభివృద్ధి

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

తిరుమల : తిరుమలలోని వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ ల్యాబ్‌ ను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి తెలిపారు. బుధవారం ఈ మేరకు ల్యాబ్‌లో ఘనంగా ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం ల్యాబ్‌ కార్యకలాపాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు మార్చి 21న ప్రారంభించిన ఈ ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలసిస్‌ ల్యాబొరేటరీలో అత్యాధునిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో మొత్తం 34 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మరో 8 మంది అవసరమని, త్వరలో వారిని కూడా నియమించి మొత్తం 42 మంది సిబ్బందితో అన్ని విభాగాలను నిర్వహించనున్నట్లు వివరించారు. టీటీడీకి అవసరమైన సరుకుల కొనుగోలు దశ నుంచే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని సరుకులను తిరస్కరిస్తున్నట్లు వివరించారు. వంట పూర్తయిన తర్వాత కూడా ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ తాగునీటి నమూనాలను కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతను టెస్ట్‌ చేసేందుకు అత్యాధునిక పరికరాలు ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే నెయ్యి నమూనాలను ప్రతిరోజూ పరీక్షించిన తర్వాతే వినియోగానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆహారం, తాగునీరు అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీటీడీ హెల్త్‌ డిప్యూటీ ఈఓ సోమన్నారాయణ, ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ఉమాశంకర్‌, ల్యాబ్‌ క్వాలిటీ మేనేజర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement