నాయుడుపేట సీఐపై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నాయుడుపేట సీఐపై విచారణ చేపట్టాలి

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

● రాష్ట్ర ఎన్నికల సంఘానికి నాయుడుపేట చైర్‌పర్సన్‌ రాజేశ్వరమ్మ ఫిర్యాదు ● డీజీపీని ఆదేశించిన ఎన్నికల సంఘం

నాయుడుపేట టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగానాయుడుపేట సీఐ వెంకటరమణ ఇష్టానుసారంగా వ్యవహరించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభ్యర్థులను బెదిరించి వేధించారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. , అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్‌ రోజున మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై విచక్షణ రహితంగా దాడిచేశారని ఆరోపించారు. ఆయన నివాసంలోకి ప్రవేశించి నాయకులు, కార్యకర్తలను దుర్భషలాడడం, వైస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి ఇంట్లో అక్రమంగా మద్యం బాటిళ్లు పెట్టి కేసు నమోదు చేశారంటూ సీసీ కెమెరాలు, వీడియో ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీంతో డీజీపీకి ఎన్నికల సంఘం ఈ సంఘటనపై నాయుడుపేట అర్బన్‌ సీఐ వెంకటరమణపై సమగ్రంగా విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక నాయకులు వెల్లడించారు. నాయుడుపేట మున్సిపల్‌ పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు దుర్మార్గంగా వ్యవహరించిన తీరుపై సంబంధిత ఆధారాలతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై 4వ తేదీన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజేశ్వరమ్మ రాష్ట్ర డీజీపీతో పాటు పోలీస్‌ రేంజ్‌ ఐజీకి, రాష్ట్ర మానవహక్కుల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, తిరుపతి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదులు పంపినట్లు తెలిపారు. నాయుడుపేట సీఐపై విచారణ జరిగేంత వరకు ఆయన్ను నాయుడుపేట నుంచి బదిలీ చేయాలని, లేకుంటే సస్పెన్షన్‌కు పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షితమైన రికార్డులు, అధికారిక వీడియో రికార్డింగ్‌లు, ఇతర మీడియా కథనాలు తదితర ఆధారాలను పరిశీలించాలని కోరారు. చైర్‌పర్సన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిశీలించి నాయుడుపేట సీఐపై విచారణ జరపాలని డీజీపీకి లేఖ పంపినట్లు నాయకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement