ఎస్వీయూలో పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో పర్యటన

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

తిరుపతి సిటీ: అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ పెయిర్‌ హబ్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్వీయూ కొనసాగుతున్న పరిశోధనా కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు హైదరాబాద్‌ వర్సిటీకి చెందిన ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ హబ్‌ బృందం వర్సిటీలో రెండు రోజుల పాటు పర్యటించింది. ఇందులో భాగంగా సెంట్రల్‌ ఫెసిలిటీ, అడ్వాన్స్డ్‌ సెల్‌ కల్చర్‌ ఫెసిలిటీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ప్రయోగశాల, కెమిస్ట్రీ ప్రయోగశాలలను సందర్శించారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బ్రహ్మానందం మానవతి, కో–ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సిబా కె ఉద్గత, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సమ్రత్‌ ఎల్‌సబత్‌, ఎస్వీయూ రెక్టార్‌ చండ్రాయుడు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు పాల్గొన్నారు

పోలీస్‌ కస్టడీకి

కామిరెడ్డి

పెళ్లకూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని విచారణ నిమిత్తం శుక్రవారం పెళ్లకూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అక్రమ కేసులో సత్యనారాయణరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులు నెల్లూరు సబ్‌ జైలుకు రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ నిమిత్తం సత్యనారాయణరెడ్డిని తీసుకొచ్చిన పోలీసులు ఎగువతాగేలి గ్రామానికి వెళ్లే రోడ్డు వద్దకు తీసుకెళ్లి పలు అంశాలపై ఆయనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కామిరెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి తిరిగి కోట కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి నెల్లూరు సబ్‌ జైలుకు తీసుకెళ్లారు.

తిరుపతి– పుదుచ్చేరి

రైలు రద్దు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: పుదుచ్చేరి – తిరుపతి మధ్య నడిచే రైలు (16112), అదేవిధంగా తిరుపతి–పుదుచ్చేరి వెళ్లే రైలు (16111) డిసెంబర్‌ 9, 10 తేదీల నుంచి అదే నెల 28వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారం యంత్రాంగం పేర్కొంది. రేణిగుంట రైల్వే యార్డు పునర్నిర్మాణం, ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కమిషనింగ్‌కు సంబంధించి గుంతకల్లు డివిజన్‌లో 48 రోజుల పాటు నిర్వహించనున్న ప్రీ–ప్రీ ఎన్‌ఐ, ప్రీఎన్‌ఐ, ఎన్‌ఐ పనుల ఏర్పాట్ల కారణంగా పలు రైళ్ల రద్దు చేశారు. ఇందులో భాగంగా తిరుపతి– పుదుచ్చేరి మధ్య నడిచే ఈ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

ప్రాణదాన ట్రస్ట్‌కు

660 మంది ఎంపిక

తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌ కింద స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రుల్లో ఉచిత శస్త్రచికిత్సల కోసం 660 మంది పేద రోగులను ఎంపిక చేశారు. శుక్రవారం స్విమ్స్‌లో నిర్వహించిన ప్రాణదాన పథకం ఎంపిక కమిటీ సమావేశంలో పేద రోగులను కమిటీ పరీశీలించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. స్విమ్స్‌ డైరెక్టర్‌ కమ్‌ వీసీ డాక్టర్‌ జగదీష్‌ మాట్లాడుతూ సుమారు 19 విభాగాల్లో 660 మందికి రూ.2.32 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, బర్డ్‌ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ రామ్మూర్తి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బలక్ష్మి, మెటర్నిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, టీటీడీ ఎస్‌ఎంఓ డాక్టర్‌ రవిశంకర్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ కోటిరెడ్డి పాల్గొన్నారు.

ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

తిరుపతి సిటీ : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ శుక్రవారం విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రాక్టికల్‌ పరీక్షలను జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement