తిరుపతి జిల్లాలో గురువారం ప్రధానంగా రైల్వేకోడూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో అధికారపార్టీ అరాచకాలు హెచ్చుమీరాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం, నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకుంటూ పెట్రోల్ బాంబులు వేశారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్రామంలో అధికార పార్టీకి చెందిన రౌడీమూక బాంబులు వేస్తారన్న ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మంగంపేట, ఓబిలి వంటి పోలింగ్ కేంద్రాల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నా పట్టించుకోలేదు. రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో దొంగ ఓటు వేస్తున్న వ్యక్తిని ఏకంగా కలెక్టరే పట్టుకున్నారు. చంద్రగిరిలో అయితే దొంగ ఓట్లలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని రికార్డులు బద్ధలు కొట్టారు. వందలాది మంది యువతను తిరుపతి, పుత్తూరు, నాయుడుపేట వంటి పట్టణాల నుంచి రప్పించి దొంగ ఓట్లు వేయించారు. బూత్‌లకు బూత్‌లు రిగ్గింగ్‌కు పాల్పడి అరాచకం సృష్టించారు. సమాచారం తెలుసుకొని వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారులను కవ్వించే విధంగా ఎమ్మెల్యే సతీమణి, కుమారులు వ్యవహరించారు.


