నేడే ప్రాదేశిక ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

నేడే ప్రాదేశిక ఫలితాలు

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

● 31 జెడ్పీటీసీలు, 302 ఎంపీటీల ఓట్ల లెక్కింపు ● ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 958 మంది అభ్యర్థులు ● జిల్లాలో 8 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలు

తిరుపతి అర్బన్‌: పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కౌంటింగ్‌ కేంద్రల్లో ఎంపీటీసీతోపాటు జెడ్పీటీసీల ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. ప్రధానంగా తిరుపతిలోని ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అత్యధికంగా 8 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీటీసీ ఫలితాలు, సాయంత్రం 6–7 గంటలకు జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 జెడ్పీటీసీలకు 126 మంది పోటీలో ఉన్నారు. అలాగే 302 ఎంపీటీసీలకు 832 మంది బరిలో ఉన్నారు. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేనా?

జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలు బరితెగించారు. దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయారు. నామినేషన్ల పర్వం నుంచి ఓటింగ్‌ వరకు విర్రవీగిపోయారు. ఓటర్లను సైతం భయాందోళనకు గురిచేశారు. ఇలాంటి నేపథ్యంలో కౌంటింగ్‌ రోజు అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కోరుతున్నారు.

ఓట్ల లెక్కింపునకు 378 టేబుల్స్‌

జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో 34 కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 378 టేబుల్స్‌ను సమకూర్చారు. ఓట్ల లెక్కింపునకు సూపర్‌ వైజర్లు 1,315 మంది, కౌంటింగ్‌ అసిస్టెంట్లు 378 మంది, మైక్రో అబ్జర్వర్లు 756 మందిని ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 68.67 శాతం ఓట్లు పోలయ్యాయి.

కౌంటింగ్‌ కేంద్రం– మండలాలు

1. నాయుడుపేట– జెడ్పీ హైస్కూల్‌–(వాకాడు, చిట్టమూరు, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు)

2. సూళ్లూరుపేట –ప్రభుత్వ జూనియర్‌ కళాశాల–(డీవీ సత్రం– సూళ్లూరుపేట, తడ)

3. వెంకటగిరి –విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల–బాలాయపల్లి,డక్కిలి,వెంకటగిరి

4. రైల్వే కోడూరు –అనంతరాజ్‌పేటలోని ఆర్టీకల్చర్‌ యూనివర్సిటీలో (చిట్వేల్‌, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు)

5. తిరుపతి –ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో–ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పాకాల, చంద్రగిరి, తిరుపతిరూరల్‌, ఆర్సీపురం, పుత్తూరు, వడమాలపేట

6. శ్రీకాళహస్తి –స్కిట్‌ ఇంజినీరింగ్‌– రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు

7. సత్యవేడు –ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల–బీఎన్‌ కండ్రిగ, వరదయ్యపాళెం, సత్యవేడు

8. పుత్తూరు –నారాయణవనం ిసిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో–కేవీబీపురం, నారాయవనం, పిచ్చాటురు, నాగలాపురం.

తొలి ఫలితం ఏర్పేడు.. తుది ఫలితం తిరుపతి రూరల్‌

ఏర్పేడు మండలానికి సంబంధించి 2,350 ఓట్ల లెక్కింపు మాత్రమే ఉండడంతో తొలి ఫలితం ఆ మండలం నుంచే వెలువడనుంది. అలాగే తిరుపతి రూరల్‌ మండలం 85,335 మంది ఉన్నత నేపథ్యంలో చివరిగా ఆ మండలం ఫలితాల ప్రక్రియ పూర్తి కానుంది. పలు మండలాల్లో మోసపూరితంగా అధికారపార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవాలు చేసుకోవడంతో 444 ఎంపీటీసీలకు కేవలం 302 మాత్రమే ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement