మా గ్రామంలో రాజకీయ వర్గ వైషమ్యాలు ఎన్ని ఉన్నా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేవి. అయితే తొలిసారి పచ్చని పల్లెలో బాంబుల వర్షం కురిసింది. చాలా భయమేసింది. ఇది పిరికిపంద చర్య. ఈ దుస్సంప్రదాయం అత్యంత హేయకరం.
– కామనూరి అరుణకుమారి,
నల్లపురెడ్డిపల్లె, పెనగలూరు మండలం
రీపోలింగ్ జరపాలి
మా గ్రామంలో టీడీపీ నాయకులు ప్రత్యర్థులను భయపెట్టి గెలవాలని భావించారు. పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడి రాజకీయాలకు కొత్త భాష్యం పలికారు. అధికారులు, పోలీసులను తొత్తులుగా మార్చుకున్నారు. కేంద్ర సాయుధ బలగాల భద్రత కల్పించి రీపోలింగ్ జరిపించాలి.
– పాటూరు సుబ్బారెడ్డి,
నల్లపురెడ్డి పల్లె, పెనగలూరు మండలం


