నేను మా సహాయకులతో కలసి వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నాం. టీడీపీ నాయకులు అల్లరి మూకలతో కలసి దారికాచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున అరుస్తూ మాపైకి పెట్రోలు బాంబులు విసిరారు. రాళ్ల వర్షం కురిపించారు. ఏం చేయాలో దిక్కు తోచలేదు. చంపేస్తారేమోనని భయమేసింది. నా తలకు బలమైన రక్తగాయమైంది. నాతోపాటు ఉన్న మా నాయకులకు గాయాలయ్యాయి.
– కసిరెడ్డి నరసారెడ్డి, నల్లపురెడ్డిపల్లె, పెనగలూరు మండలం
పెట్రోల్ నింపిన బీరు సీసా తగిలింది
నేను వైఎస్సార్ సీపీ ఏజెంట్ నరసారెడ్డికి రిలీవర్‌గా వెళ్తున్నా. టీడీపీ అల్లరి మూకలు విసిరిన పెట్రోల్ బాంబుల్లో బీరు సీసా ఒకటి నా కాలికి తగిలి తీవ్ర గాయ మైంది. నాలుగు కుట్లు పడ్డాయి. దేవుడి దయ వల్ల బతికి బయట పడ్డాం. టీడీపీ గూండాలు చాలా దారుణంగా వ్యవహరించారు.
– శివారెడ్డి, నల్లపురెడ్డిపల్లె, పెనగలూరు మండలం


