తిరుచానూరులో జేబీ రౌడీయిజం! | - | Sakshi
Sakshi News home page

తిరుచానూరులో జేబీ రౌడీయిజం!

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

● తిరుపతి నుంచి వచ్చిన రౌడీలు మహిళలపై దాడికి యత్నం ● జేబీ రౌడీల తీరుపై రోడ్డుపై బైఠాయించి నిరసన

మందీమార్బలంతో పోలింగ బూత్‌ల వద్ద హల్‌చల్‌

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: చంద్రగిరి నియోజకవర్గంలో ఓటు హక్కులేని టీడీపీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ హల్‌చల్‌ చేశారు. ఇటీవల తిరుపతి నగర మేయర్‌గా ఎన్నికై న జేబీ శ్రీనివాస్‌కు తిరుచానూరులో ఎలాంటి ఓటు హక్కు లేకపోయినా, పెద్ద ఎత్తున తన మందీమార్బలంతో పోలింగ్‌ బూత్‌ల వద్ద హల్‌చల్‌ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ బూత్‌ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. జేబీ శ్రీనివాస్‌ మౌఖిక ఆదేశాలతో పోలీసులు వైఎస్సాస్‌పీపీ నేతలు, ఏజెంట్లను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారు. తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరించాడంటూ వైఎస్సాసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మహిళపై దౌర్జన్యం.. రోడ్డుపై నిరసన

ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే మహిళలపై జేబీ శ్రీనివాస్‌ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడడంతో స్థానిక మహిళలు మండిపడ్డారు. ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో తిరుపతిలోని ఓ హోటల్‌ యజమాని తనయుడు మహిళను పరుష పదజాలంతో బూతులు తిడుతూ, దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మహిళలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. పోలింగ్‌ బూత్‌ ఎదురుగా రోడ్డపై బైఠాయించి నిరసనకు దిగారు. జేబీ శ్రీనివాస్‌ రౌడీలను ఇక్కడి నుంచి పంపించాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మహిళల పట్ల చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు రౌడీ మూకలను పోలింగ్‌ బూత్‌ నుంచి పంపడంతో నిరసనను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement