అక్కను చూసి వస్తూ అనంత లోకాలకు | - | Sakshi
Sakshi News home page

అక్కను చూసి వస్తూ అనంత లోకాలకు

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

– రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

ఏర్పేడు: ఏర్పేడు – శ్రీకాళహస్తి మార్గం మేర్లపాక టోల్‌గేట్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. శ్రీకాళహస్తి పట్టణం, ముత్యాలమ్మగుడి వీధికి చెందిన గొల్లపల్లి దేవరాజులు కుమార్తె గొల్లపల్లి సుప్రియ (20), ఆమె స్నేహితులు మన్నసముద్రం గ్రామానికి చెందిన రూపేష్‌వర్మ శ్రీకాళహస్తికి చెందిన నరసింహతో కలిసి బైక్‌ పై తిరుపతికి వెళ్లింది. అక్కడ నర్సింగ్‌ చేస్తున్న తన అక్క పవిత్రతో మాట్లాడి తిరుగుపయనమయ్యారు. ఏర్పేడు దాటాక, మన్నసముద్రం గ్రామం వెళ్లి అక్కడ నుంచి ముగ్గురూ కలసి శ్రీకాళహస్తికి వెళుతుండగా, మేర్లపాక టోల్‌ ప్లాజా వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా వెనుక నుంచి లారీ అతివేగంగా బైక్‌ను ఢీ కొట్టింది. వెనుక కూర్చున్న సుప్రియ కింద పడడంతో ఆమె తల మీద లారీ చక్రాలు ఎక్కేశాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైక్‌ పై ఉన్న నరసింహులు తలకు రక్త గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. సుప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పోలింగ్‌ సరళి పరిశీలన

తిరుపతి సిటీ: జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, రైల్వేకోడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజవర్గాల్లోని పలు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట–2 జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించి ఓ యువకుడుని గుర్తించి పోలిసులకు అప్పగించారు. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు అనంతరాజుపేటలోని హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములను, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement