రిగ్గింగ్‌పై నిరసన | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌పై నిరసన

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

● చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్‌ నిర్వహించాలి ● అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

చంద్రగిరి: స్థానిక ఎమ్మెల్యే నాని అరాచకాలు దారుణమని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల్లో గురువా రం చంద్రగిరి, పాకాల మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, దొంగ ఓట్లకు పూనుకున్నారంటూ ఆయన పాకాల, చంద్రగిరి జెడ్పీటీసీ అభ్యర్థులతో కలసి టవర్‌క్లాక్‌ వద్ద నిరసనకు దిగారు. టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాలు, దొంగ ఓట్లపై అంబేడ్కర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రగిరి, పాకాల మండలాల్లో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యమైందన్నారు. నియోజకవర్గ పరిధిలోని దాదాపు 90 శాతం బూతుల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌ సాగిందని ఆరోపించారు. చంద్రగిరిలోని ఆరు పోలింగ్‌ బూతులను పూర్తిగా క్యాప్చర్‌ చేశారని విమర్శించారు. చివరకు జెడ్పీటీసీ అభ్యర్థి తమ కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఓటు వేసుకోలేని దయనీయమైన పరిస్థితి దాపురించిందన్నారు. కొటాల, నరసింగాపురం, అరిగలవారిపల్లి గ్రామాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

జెడ్పీటీసీ అభ్యర్థినే ఓటు వేయనీయలేదు

చంద్రగిరి మండల జెడ్పీటీసీ అభ్యర్థి కొటాల పద్మజను ఓటు వేయనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని చెవిరెడ్డి మోహిత్‌ మండిపడ్డారు. రామిరెడ్లిపల్లి పోలింగ్‌ బూత్‌లో ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ఓటు ఉందన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో వారి ఇంటిని సైతం టీడీపీ గూండాలు దగ్ధం చేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తాము ఓటు వేసేందుకు అనుమతులు ఇవ్వాలని పలుమార్లు కోరినా సీఐ సత్యనారాయణ పట్టించుకోలేదన్నారు.

రీ పోలింగ్‌ జరపాలి

టీడీపీ నేతలు బూత్‌ క్యాప్చర్‌ చేసి భారీగా చేసిన రిగ్గింగ్‌లపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాకాల మండలంలో 53 పోలింగ్‌ కేంద్రాలు, చంద్రగిరిలోని కల్‌రోడ్డుపల్లి, ఐతేపల్లి, అగరాల, నరసింగాపురం, రామిరెడ్డిపల్లి, కొటాల పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు. ఆయా కేంద్రాల్లో తక్షణమే రీ పోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement