కామిరెడ్డి కుటుంబం.. గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కామిరెడ్డి కుటుంబం.. గెలుపే లక్ష్యం

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

పెళ్లకూరు: వైఎస్సార్‌సీపీ పెళ్లకూరు జెడ్పీటీసీ అభ్య ర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బరిలో దిగారు. శ్రీపొట్టిశ్రీనెల్లూరు జిల్లా కేంద్రకారాగారం నుంచే ఆయన నామినేషన్‌ ధాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ, చిన్న కుమార్తె కామిరెడ్డి రజని మండలంలోని అన్నీ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. బుధవారం ఈ మేరకు రజని మాట్లాడుతూ తన తండ్రిని చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించారు. స్వర్ణముఖి నదిలో టీడీపీ నేతలు ఇసుక తవ్వేసి అక్రమ రవాణా సాగిస్తుంటే ప్రశ్నించినందుకు తన తండ్రిని జైలులో పెట్టారని మండిపడ్డారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన తర్వాత మళ్లీ మరో అక్రమ కేసులో ఇరికించి జైలుకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఉన్నప్పటికీ తన తండ్రి ఏమాత్రం బెదరకుండా జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకుని న్యాయం గెలిచేందుకు సహకరించాలని కోరారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లేసి సత్యనారాయణ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే పాలచ్చూరు, కలవకూరు ఎంపీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న పాలూరు రత్నమ్మ, బండి బాలచంద్రను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement