పోలింగ్‌ స్టేషన్ల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ స్టేషన్ల కేటాయింపు

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

తిరుపతి అర్బన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పీవోలు, ఏపీవోలు, ఓపీఓలకు కలెక్టరేట్‌లో 3వ రాండమైజేషన్‌ చేపట్టారు. ఈ మేరకు మంగళవారం పోలింగ్‌ స్టేషన్లు జిల్లా సాధారణ పరిశీలకులు వరప్రసాద్‌ ఆధ్వర్యంలో కేటాయింపు ప్రక్రియను పూర్తిచేశారు. ఆ మేరకు పీవోలు, ఏపీవోలు, ఓపీఓలు విధులు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఖాకీ చొక్కా విప్పి..

స్టేషన్ల చుట్టూ తిప్పి

దొరవారిసత్రం: ఖాకీ చొక్కా విప్పేశారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కేశారు. అధికార పార్టీకి మూడు సింహాలు దాసోహమైపోయాయి. నాయుడుపేట పట్టణంలోని కౌటింగ్‌ కేంద్రం వద్ద మంగళవారం పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. రీకౌంటింగ్‌ పేరుతో తమ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారని తెలుసుకుని కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను అడ్డుకున్నారు. రాక్షసంగా ప్రవర్తిస్తూ దాడికి పూనుకున్నారు. ఆపై బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు అటూ ఇటూ తిప్పి చివరికి డీవీ సత్రం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిర్బంధించి కర్కశంగా వ్యవహరించారు. తర్వాత దొరవారిసత్రం పోలీస్‌స్టేషన్‌ నుంచి విడుదల చేసి సూళ్లూరుపేటకు తీసుకెళ్లారు. దీనిపై స్థానికులు, పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement