రాపూరు: రాపూరు మండలం, నాగవారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అచ్చుత పెంచలప్రసాద్ తన అనుచరులతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని వైఎస్సార్సీపీ నాయకులు బండి పెంచలనరసారెడ్డి, శ్రీహరిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేసిన మేలుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో పెంచల నరసింహులు, జనార్దన్, శ్రీనివాసులు, రవీంద్ర, మల్లికార్జునరావు, శివకుమార్ పెంచలయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామచంద్రయ్య, శివసాయిప్రతాప్, ప్రణయ్, పెంచలయ్య పాల్గొన్నారు.


