ప్రజాస్వామ్య పరిరక్షణకే న్యాయపోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణకే న్యాయపోరాటం

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

తిరుపతి రూరల్‌: నామినేషన్ల దశలో తమ పార్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, పోలింగ్‌ సమయంలో కూడా అలాంటి దాడులు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉందన్న ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించినట్టు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌ సమయాన బయట వ్యక్తులు లోపలకు వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, అభ్యర్థులకు న్యాయం, ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని కోర్టును అభ్యర్థించగా హైకోర్టు ధర్మాసనం పోలింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు ఒక్క తిరుపతి రూరల్‌ మండలం పరిధిలో 169 పోలింగ్‌ కేంద్రాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్టు కోర్టుకు నివేదిక ఇచ్చారు. మిగిలిన ఆరు మండలాల పరిధిలో పోలింగ్‌ జరిగే అన్ని కేంద్రాలకు ఇదే తరహాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించినట్టు మోహిత్‌రెడ్డి వివరించారు.

భయపడొద్దు.. స్వేచ్ఛగా ఓటేయండి

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement