శ్రీకాళహస్తి: అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో శ్రీకాళహస్తికి చెందిన కరాణి రోమిత్‌రెడ్డి, కరాని లోషిత ప్రతిభకనబరిచారు. బెంగళూరులో నిర్వహించిన వరల్డ్ కరాటే కాన్ఫడరేషన్ చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు అద్భుత ప్రతిభ చూపి బంగారు పతకాలు కై వశంచేసుకున్నారు. రోమిత్‌రెడ్డి తన కటా విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా కుమిటే బాలికల విభాగంలో లోషిత ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం సాధించింది. వీరికి బాబాయి, పిన్ని అమర్‌నాథ్, పూర్ణిమ, మామ మణికయ్, జ్యోతి ప్రోత్సాహం అందించి తీర్చిదిద్దారు. వీరు శ్రీకాళహస్తి మండలం, నారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో 2, 4 తరగతులు చదువుతున్నట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. స్వర్ణపతకాలు సాధించడంపై ప్రధానోపాధ్యాయురాలు శ్వేత, ఉపాధ్యాయులు దామోదర్‌రెడ్డి, రామ, ఉమ, కిరణ్ అభినందించారు.


