తిరుపతి సిటీ:స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం దత్తత గ్రామం వెంకటాపురంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పలు క్రీడలు, దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. జాతీయ ఐక్యత, సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులచేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్సిపల్ డాక్టర్ ఓ చంద్రశేఖర్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.


