తిరుపతి రూరల్ : పద్మావతి మహిళా వర్సిటీ ఆచార్యుడు పి. వెంకటకృష్ణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం–ఎల్సెవియర్ సంయుక్తంగా ప్రకటించిన ప్రపంచ టాప్ 2 శాస్త్రవేత్తల జాబితా 2026లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. కెరీర్ లాంగ్ డేటా ప్రకారం ప్రపంచ స్థాయిలో 4,53,842వ ర్యాంకు, సంబంధిత ఉప విభాగంలో 11,557వ ర్యాంకు సాధించారు. ఆయన హెచ్–ఇండెక్స్ 27గా నమోదైంది. శుక్రవారం ఈ మేరకు ప్రొఫెసర్ వెంకటకృష్ణను వర్సిటీ వీసీ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్.ఉష అభినందించారు.


