ఓబులవారిపల్లె : పంచాయతీ కార్యాలయానికి చెందిన ట్రాక్టర్ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడింది. మద్యం మత్తులో డ్రైవర్ వేగంగా తోలడంతోనే ప్రమాదం జరిగింది. వేగంగా బండరాళ్లను ఢీ కొనడంతో గుంతలో పడి ఇంజన్ రెండు భాగాలుగా విడిపోయింది. చెత్తను తరలిస్తుండగా ముదినేపల్లి వద్ద ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ సురక్షితంగా తప్పించుకున్నాడు.
టిప్పర్ ఢీకొని టీటీడీ ఉద్యోగికి గాయాలు
చంద్రగిరి: మండలంలోని దోర్నకంబాల సమీపంలో శుక్రవారం ఉదయం త్యాగరాజు అనే టీటీడీ ఉద్యోగిని టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో త్యాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. గ్రావెల్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. మట్టిని తరలించే టిప్పర్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
రామచంద్రాపురం : మండలంలోని నడవలూరు దళితవాడకు చెందిన ప్రేమల ప్రదీప్ (31) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు.. ప్రదీప్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు బుధవారం రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రామాపురం ఆశ్రమం సమీపంలోని ఓబావిలో ప్రదీప్ మృతదేహం కనిపించింది. ప్రదీప్ మృతిపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం పక్షవాతం రావడంతో ప్రదీప్‌కు కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. ఎక్కువ దూరం నడవలేని స్థితిలో అంత దూరాలనికి ఎలా వెళతాడని అనుమానిస్తున్నారు.


