పెనగలూరు : మండలంలోని కొత్త సింగనమలలో శుక్రవారం రాత్రి 60 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. కొండూరు అజయ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కొత్త సింగనమల యువత పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కారిస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసింహులు, నేతలు గుండ్లూరు మల్లికార్జున, పెంచలయ్య, చింతకాయల కృష్ణయ్య, నరసింహులు, వెంకటసుబ్బయ్య, సురేష్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నవీన్, గుండాల్ రెడ్డి, జనార్ధన్ పాల్గొన్నారు.
వెంకటగిరి రూరల్ : బాలాయపల్లి మండలం జార్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత ముత్యంగారి ధనంజయ్య ఆధ్వర్యంలో 15 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు వెందోటి కార్తీక్‌రెడ్డి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పిగిలాం సెగ్మెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి చంద్రయ్యను విజయానికి కృషి చేయాలని కోరారు. నేతలు మల్లెల వెంకటేశ్వర్లు, గురునాఽథ్, మస్తాన్, గోపాల్ యాదవ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు .


