విజయమే లక్ష్యంగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యంగా పనిచేద్దాం

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

తిరుపతి రూరల్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేద్దామని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు ఎర్రావారిపాళెం మండలంలోని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అప్పీళ్ల వరకు అనేక అడ్డంకులను ఎదుర్కొని టీడీపీ నేతలు, పోలీసులతో యుద్ధం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే 50 స్థానాల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి నామినేషన్లను నిలబెట్టుకుని ప్రజా క్షేత్రంలోకి వచ్చిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. టీడీపీ దౌర్జన్యాలు, అడ్డంకుల కారణంగానే కొన్ని చోట్ల ఎన్నికలు జరగలేదని ప్రజలకు వివరించాలని సూచించారు. ఏకగ్రీవమైన పంచాయతీల్లోనూ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వైఎస్సార్‌సీపీ కల్పించిందనే విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిందని, పులివర్తి నాని కారణంగా రౌడీ రాజ్యం వచ్చిందని విమర్శించారు. ఎర్రావారిపాళెం మండలంలోని రెండు ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ అభ్యర్థి విజయానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement