నాయుడుపేట మున్సిపాలిటీ పీఠం వైఎస్సార్‌సీపీదే | - | Sakshi
Sakshi News home page

నాయుడుపేట మున్సిపాలిటీ పీఠం వైఎస్సార్‌సీపీదే

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

● నాయుడుపేటలో హోరెత్తి ప్రచారం

నాయుడుపేట టౌన్‌: నాయుడుపేట మున్సిపాల్‌ పీఠాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిని తంబిరెడ్డి రాజేశ్వరమ్మ అధిరోహించడం ఖాయమని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి ధీమా వ్యక్తం చేశారు. నాయుడుపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీలో ఉన్న కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. పట్టణంలోని సీఎస్‌ తేజ సెంటర్‌ వద్ద నుంచి ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి బేరిపేట, మసీదువీధి, బజారువీధుల్లో ప్రచారాన్ని చేశారు. ఒకవైపు తిరుపతి ఎంపీ, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వ్యాపారులు, దుకాణదారులు, గృహ యజమానుల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ చైర్‌పర్సన్‌తో పాటు వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యానుగుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు పలు కూడళ్ల వద్ద మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన అజెండగా చేసుకుని మున్సిపల్‌ బరిలో ఉన్నారన్నారు. రాజేశ్వరమ్మను ప్రజలు ఆధరించి ఆఖండ విజయం చేకూరిస్తే మున్సిపాలిటీలో మౌలి వసతులు కల్పించడంతో పాటు ప్రజాసమస్యల సత్వరపరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, నాయకులు తంబిరెడ్డి సురేష్‌రెడ్డి, కౌన్సిలర్‌ అభ్యర్థులు జలదంకి వెంకటకృష్ణారెడ్డి, పాపారెడ్డి చంద్రారెడ్డి, వేలూరు కన్మణి, ఆర్కాటి శాంతకుమార్‌, కలపాటి ఇమేలియా స్వర్ణలతతోపాటు నాయకులు చదలవాడ కుమార్‌, గంధవల్లి సిద్ధయ్య, కటకం జయరామయ్య, తేజారెడ్డి, ఆవుల లోకేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement