స్విమ్మింగ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌–14, 17, 19 బాలబాలికల స్విమ్మింగ్‌ జిల్లా జట్ల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఆ మేరకు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు సాంబశివరావు, లోకానాథం, త్రిలోక సుందరీ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఆయా విభాగాలకు సంబంధించి దాదాపు 150 మంది స్విమ్మర్లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. వీరికి ఆయా కేటగిరి విభాగాల్లో డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ కోచ్‌ ఆది పర్యవేక్షణలో బాలబాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన 36 మంది స్విమ్మర్లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వచ్చే నెల కర్నూలులో నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీఓ శశిధర్‌, మాజీ డీఎస్‌డీఓ జయరామయ్య, పీడీలు విజయకుమారి, శకుంతల, శిరాజ్‌, అన్వర్‌బాషా, సురేంద్రరెడ్డి, స్విమ్మర్లు పాల్గొన్నారు.

భూసార పరీక్షలతో దిగుబడులు

నారాయణవనం: రైతులు సాగు ఖర్చులను తగ్గించుకుంటూ, భూసారాన్ని పరిరక్షించుకుంటూ అధిక దిగుబడులు సాధించేందుకు శాసీ్త్రయ పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని ఎరికంబట్టులో మంగళవారం రాస్‌ కేవీకే, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. రాస్‌ శాస్త్రవేత్త శ్రీనివాసులు, ఏడీ శైలజ కుమారి మాట్లాడుతూ భూసార పరీక్షలు చేయించి, నివేదికల ఆధారంగా ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని తెలిపారు. అనవసరపు ఖర్చులు తగ్గడమే కాకుండా పంటలకు అవసరమైన పోషకాలు సమతుల్యంగా అంది మంచి దిగుబడులు వస్తాయన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, జీవన ఎరువుల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పచ్చిరొట్ట ఎరువుల సాగు ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఏవో శోభరాణి, జిల్లా వనరుల కేంద్రం అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు, ఇ–పంట నమోదు, ఎరువుల పంపిణీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త బాల హుస్సేన్‌రెడ్డి రబీ పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement