బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని పార్లపల్లి గ్రామంలోని అరుంధతివాడలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. మండలంలోని పార్లపల్లి అరుంధతివాడకు చెందిన బద్రి, జగదీష్, కుటుంబ సభ్యులకు, సుబ్రమణ్యం, బాలాజీ, హరి కుటుంబ సభ్యులకు నాలుగు నెలల క్రితం జరిగిన మాతమ్మ కొలువులో గొడవలు జరిగాయి. గ్రామ పెద్దలు సర్దిచెప్పి రాజీ కుదిర్చారు. మంగళవారం సుబ్రమణ్యం మామ మరణించడంతో అంత్యక్రియలు అనంతరం మద్యం మత్తులో ఉన్న బద్రి, జగదీష్, శ్రీకాళహస్తి చెందిన మునికుమార్, సాయిలు సుబ్రమణ్యం, బాలాజీ కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్రమణ్యం, బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా బాలాజీ భార్యకు, మేనకోడలు, మరో ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.


