– వ్యక్తి దుర్మరణం
నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు అర్బన్‌హెల్త్ క్లినిక్ సమీపంలో రహదారిపై సోమవారం అర్ధరాత్రి మోటారు బైక్ ఆవును ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రబాబు కాలనీకి చెందిన మన్నారు విజయ్(31) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం.. చంద్రబాబు కాలనీకి చెందిన విజయ్ ఏసీ మెకానిక్. సోమవారం రాత్రి బైక్‌పై నాయుడుపేటకు వచ్చి తిరిగి అర్ధరాత్రి సమయంలో స్నేహితుడైన వెంకటేశ్వరుతో కలిసి బయలుదేరాడు. బైక్‌ను వెంకటేశ్వర్లు నడుపుతుండగా విజయ్ వెనక కూర్చుని వెళుతున్నాడు. ఒక్కసారిగా ఆవు రహదారికి అడ్డురావడంతో బైక్‌ను అదుపు చేయలేక ఢీకొట్టాడు. వెనుక కూర్చుని ఉన్న విజయ్ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.


