ఇళ్లు మంజూరు చేయండి
మాకు చిన్నపాటి ఇంటి స్థలాలు ఉన్నాయి.ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వాటిని నిర్మించి ఇవ్వాలి. ఇప్పటికే అధికారులకు చాలా అర్జీలు ఇచ్చాము. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు.
– చిట్టిమూరు మండలంలోని గుణపాడు ఎస్టీ కాలనీవాసులు
తిరుపతి అర్బన్: ీపజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను నిశితంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 333 అర్జీలు వచ్చాయి. వీటిని జాయింట్ కలెక్టర్ గోవిందరావుతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, భరత్‌నాయక్, నాగార్జున, రామాంజమమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి స్వీకరించారు. తల్లికి వందనంకు వచ్చే అర్జీలను పరిశీలించి అర్హత ఉన్నవారికి జాప్యం లేకుండా న్యాయం చేయాలని జేసీ ఆదేశించారు.


