13న సూళ్లూరుపేటలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

13న సూళ్లూరుపేటలో జాబ్‌మేళా

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

తిరుపతి అర్బన్‌: సూళ్లూరుపేటలోని ఎస్వీఎస్‌ఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13వ తేదీన జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌, సీడాప్‌ సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శ్రీసిటీతోపాటు చైన్నెలోని పలు బహుళజాతి కంపెనీలు ఇంటర్వ్యూలకు హాజరవుతాయని చెప్పారు. 18–35 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని, పదోవ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ చదువుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు నైపుణ్యం.ఏపీ.జీవోవీ,ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 9121646661, 9700561225,9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఆర్వో నరసింహులు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌, ఎన్‌టీఓయూ సురేష్‌బాబు, స్కిల్‌ హబ్‌ కో–ఆర్డినేటర్‌ దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement