టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

కేవీబీపురం: మండలంలోని టీడీపీ, జనసేన నుంచి పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జయలక్ష్మీపురం గ్రామం నుంచి జనసేన పార్టీ నేత పి.హరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదేవిధంగా వేమలపూడి గ్రామం నుంచి 20 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వేములపూడి వైఎస్సార్‌సీపీ నేత మధు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సుబ్రమణ్యం, రామయ్య, వెంకటరామయ్య, శ్రీనివాసులు, హరికృష్ణ, సుబ్రహ్మణ్యం తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు. మండల పార్టీ కన్వీనర్‌ గవర్ల కృష్ణయ్య, నందకుమార్‌, ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ నియోజకవర్గం అధ్యక్షుడు ప్రసాద్‌ రెడ్డి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement