అక్షీరా మామ్‌ అండ్‌ మీ హాస్పిటల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అక్షీరా మామ్‌ అండ్‌ మీ హాస్పిటల్‌ ప్రారంభం

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

తిరుపతి కల్చరల్‌: రాయలసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కరకంబాడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షీరా మామ్‌ అండ్‌ మీ హాస్పిటల్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఇందులో ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తుడా చైర్మన్‌ సి.దివాకర్‌రెడ్డి, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, అన్నా అనిత ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్‌ అధినేతలను అభినందించారు. హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ రేష్మారెడ్డి మాట్లాడుతూ తమ ఆస్పత్రి రాయలసీమలో మాతా శిశువైద్య సేవల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆధునిక వైద్య పరికరాలతో వైద్యం అందజేస్తామన్నారు. మహిళలు, నవజాత శిశువులు, చిన్నారులకు సమగ్ర వైద్య సేవలు అందించే ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధునాతన లెవల్‌–111 ఎన్‌ఐసీయూ సదుపాయం, అత్యవసర పరిస్థితుల్లో చిన్నారుల కోసం ఆధునాతన పీఐసీయూ, 24/7 క్రిటికల్‌ కేర్‌ సేవలు, 24 గంటల పాటు అనుభవజ్ఞులైన వైద్యులతో అందిస్తామని వెల్లడించారు. నియ్నోటాలజీ సేవలు, ప్రసూతి, గైనకాలజీ వైద్య సేవలు, పెయిన్‌ లెస్‌ డెలివరీ సదుపాయం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement