విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాటాలు ప్రారంభించాలి. లేకుంటేలో పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు మరింత దిగజారే పరిస్థితికి చేరుతాయి. బాబు సర్కార్ విద్యార్థి సంఘాలపై విధించిన ఆంక్షలను ఉపసంహరించుకునే వరకు పోరాటాలు ప్రారంభించాలి. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి.
– షేక్ మన్సూర్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి
నియంతృత్వ పాలన
విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించడం బాబు సర్కార్ నియంతృత్వ పాలనకు నిదర్శనం. కార్పొరేట్ శక్తుల ఇష్టారాజ్యానికి ఇదో ఆయుధం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై చంద్రబాబు ప్రభుత్వ దాడులకు దిగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోంది. విద్యార్థుల ఆగ్రహానికి మంత్రి లోకేష్ గురికాక తప్పదు. – టి.స్వరూప్,
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు
విద్యాసంస్థల్లోకి అనుమతి నిరాకరణ సరికాదు


