చంద్రగిరి కొంగారెడ్డి పల్లె వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ దుకాణంపైకి దూసుకెళ్లింది.
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
అక్రమాలకు అడ్డాగా మెగా డీఎస్సీ
వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జెన్‌జెడ్ వార్ రిలే నిరాహారదీక్షకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొని ప్రసంగించారు. డీఎస్సీని అక్రమాలకు అడ్డాగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. మాజీ మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి సంఘాల నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
‘చిన బాబు..పెద బాబు నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. మెగా డీఎస్సీ పేరుతో నయ వంచనకు పాల్పడ్డారు. ర్యాంకులు సాధించిన వారిని పక్కన బెట్టేశారు. స్పోర్ట్స్’ కోటా పేరుతో తమ అనుయాయులకు పోస్టులు కట్టబెట్టేశారు. అంగట్లో పప్పూబెల్లాల్లా డీఎస్సీ పోస్టులను అమ్మేసుకున్నారు. నిజంగా అవినీతి జరగలేదని భావిస్తే కూటమి నాయకులు సీబీఐ విచారణకు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం చాలా బాధాకరం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి’.. అంటూ నేతలు, యువకులు, నిరుద్యోగులు డిమాండ్ చేశా రు. శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన జెన్‌జెడ్ రిలేనిరాహా దీక్షలకు విశేష స్పందన లభించింది.
తిరుపతి : రిలే నిరాహార దీక్షలో జిల్లా అధ్యక్షుడు భూమన, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం


